PDPL: రామగుండం ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా లీక్ కావడంతో యూరియా ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. 15 రోజులపాటు ప్లాంట్ను షట్ డౌన్ చేసి మరమ్మతులు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడింది. ప్లాంట్ షట్ డౌన్ కావడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.