WNP: జిల్లాలో 8,569 మంది అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షలు రాయనున్నారని, అందుకోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల15,16తేదీలలో నిర్వహించే పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.