SRD: జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ను శుక్రవారం హైదరాబాద్ లో TSIDC మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ విశేషాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఎంపీ సూచించారు. ఇందులో ఉమ్మడి జిల్లా జడ్పీకో ఆప్షన్ మెంబర్ రషీద్, గౌసోద్దీన్ జావీద్, హాన్నన్, ఉన్నారు.