నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లన్నీ మూసివేశారు. జలాశయానికి ఇన్ ఫ్లో 79,434 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 66,234 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది.