ప్రకాశం: చంద్రశేఖరపురంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన భైరవకోనలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం ఈఓడీ వంశీకృష్ణారెడ్డి, ముప్పాళ్ల శ్యామసుందర్ రాజు పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు, తాగునీరు వసతులు కల్పిస్తామని ఈఓ వంశీకృష్ణ తెలిపారు.