నిర్మల్: భైంసా పట్టణంలోని బుద్ధవిహార్లో సోమవారం బుద్ధవిహార్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధగురువు భంతే నాగవంశ్ అమరావతి మాట్లాడుతూ.. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయని అన్నారు. అనంతరం సుమారు 200 మంది విద్యార్థులకు వివిధ ప్రవేశ పరీక్షల స్టడీ మెటీరియల్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, డిక్షనరీలు అందజేశారు.