SRPT: లాకప్ డెత్ బాధితుడు కర్ల రాజేష్ కేసు అంశాలపై చర్చించేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రేపు కోదాడకు రానున్నారు. ఫిబ్రవరి 27న రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించగా, కేసు దర్యాప్తు పురోగతిపై డీఎస్పీ రవిని కలవనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణ పాల్గొంటారని జిల్లా నాయకుడు రాజు వెల్లడించారు.