NGKL: పదర మండలం వంకేశ్వరం గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సర్పంచ్ మౌనిక మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు తగ్గి భద్రత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్, ఉప సర్పంచ్‌తో పాటు నాయకులు రామయ్య, విజ్జప్ప, రామ్మూర్తి, మాణిక్యం, కిషోర్, అరవింద్, సత్యం, హుస్సేన్, తిరుపతి పాల్గొన్నారు.