MNCL: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో బాధ్యతయుతంగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిర్వహిస్తున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా గోడ ప్రతులను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 27 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించనున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలన్నారు.