ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా నకిలీ పదార్థాల దందా(Fake Items Business) మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒకచోట కల్తీల దందా విచ్చలవిడిగా సాగుతోంది. స్వార్థం కోసం, సంపాదన కోసం కొందరు ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీనివల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతూ తమ ఆరోగ్యాన్ని(Health Problems) నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్(hyderabad)లో నిత్యావసర పదార్థాలను కల్తీ(Adulteration of essential ingredients) చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
కాటేదాన్‌లోని పరిశ్రమపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిపోయిన అల్లం(Ginger paste), పాడైపోయిన వెల్లుల్లి(Garlic)లో ప్రమాదరకర రసాయనాలను కలిపి అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటుగా మ్యాంగ్ కూల్ డ్రింక్ (Mango cool drinks)ను కూడా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సైబరాబాద్ పోలీసులు దాడులు(Police Raids) చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి పేస్టు బాగా ఘాటుగా ఉండేందుకు అసిటిక్ యాసిడ్(Acitic acid) లాంటి ప్రమాదకర రసాయనాలను మిక్స్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెల్లిపాయల పొట్టును కూడా పేస్ట్‌లో కలుపుతున్నారని, పేస్ట్ తయారీలో మురుగు నీటిని వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పరిశ్రమకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గత కొన్నేళ్లుగా పరిశ్రమను నడుపుతున్నారని అధికారులు వెల్లడించారు. కల్తీ దందా(Adulteration of essential ingredients) సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆకస్మికంగా దాడులు చేయడంతో ఇద్దరు నిర్వాహకులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ దాడుల్లో 500 కేజీల అల్లం, వెల్లల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ కూల్ డ్రింక్స్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌లో ఉంచి ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.