అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లనున్నారంటే?
Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో సంబంధాలు ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమంది ఈ లిస్ట్‌లో ఉన్నారట. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఈ కేటగిరీలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరితే నియోజవర్గాల అభివృద్ధికి నిధులు రావడంతో పాటు సొంత బిజినెస్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని, అభివృద్ధి కూడా జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
ఎన్నికల ప్రచారం సమయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేవంత్ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కాకుండా.. ప్రజల నమ్మకాన్ని గెలిపించడానికైనా చేస్తారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. వెంటనే పార్టీ మారకపోయిన సందర్భం చూసుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయట. అయితే దాదాపుగా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదిలా ఉండే కాంగ్రెస్‌లో చేరాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ల పదవులకు రాజీనామా చేసి రమ్మని షరతు పెడుతుందా? లేదా ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాతే తీసుకుంటామని చెప్తుందా? అని కూడా బీఆర్ఎస్ ఎమ్మేల్యేల మధ్య చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఏర్పాటు హడావుడిలో ఉండి వీటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎంత మంది నాయకులు కాంగ్రెలోకి వెళ్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచియుండాల్సిందే.