తెలుగు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ ఆహా కొన్ని ప్రోగ్రామ్స్‌తో మంచి పేరు తెచ్చుకుంటోంది. తమ మధురమైన గానంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol) 2 కంటెస్టెంట్లు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇక ఈ షోలో కంటెస్టెంట్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖ సింగర్లు. ఇప్పటికే శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal), హిమేష్ రేష్మియా, జీవీ ప్రకాశ్, DSPలు పలువురు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ మీద ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఐడల్ సీజన్ 2లో తన మధురమైన గానంతో అదరగొడుతున్న సిద్దిపేట ముద్దు బిడ్డపై ట్వీటర్ వేదికగా మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అభినందనలు తెలిపారు . ఆహా వేదికగా ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2 కంటెస్ట్ంట్ అయిన లాస్యప్రియ (Lasya priya) గానంపై ప్రశంసలు కురిపించారు హరీష్ రావు. అంతేకాకుండా.. ఫైనల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా పాటలు పాడి ఆయన అంతరంగాన్ని గెలుచుకుంది.
దీంతో అల్లు అర్జున్ ఏకంగా లాస్య ప్రియకు పాప్ స్టార్ అనే బిరుదుతో ఓ లాకెన్ని అందించారు. ఇక.. ఆహా ఓటీటీలో నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్-2023 కార్యక్రమం ముగిసింది. ఈ సీజన్-2 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన భాగవతుల సౌజన్య (Saujanya) విజేత కాగా, తెలంగాణలోని సిద్దిపేట(Siddipet)కు చెందిన లాస్యప్రియ రన్నరప్ గా నిలిచింది. ట్వీటర్ వేదికగా ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు. “ఆహాలో జరుగుతున్న ఇండియన్ ఐడల్ 2 సింగింగ్ షోలో అద్భుతంగా పాడుతూ.. తన గానంతో అందరిని మెప్పిస్తున్న సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్యప్రియకు హృదయపూర్వక అభినందనలు. నీ సంగీతాన్ని ఇలాగే కొనసాగించి, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు.ప్రస్తుతం టాప్ 7 కంటెస్టెంట్స్ లో లాస్యప్రియ ఒకరు. టాలెంట్ ఎక్కడ ఉన్నాగానీ దానిని అభినందించడంలో ఎప్పుడూ ముందుంటారు హరీష్ రావు.మున్ముందు లాస్యప్రియ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.