»The Second Schedule Of August 6 Night Is Complete
‘August 6 Ratri’ Movie: ‘ఆగస్ట్ 6 రాత్రి’ సెకండ్ షెడ్యూల్ పూర్తి
'ఆగస్ట్ 6 రాత్రి' సినిమా('August 6 Ratri' Movie) క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని, ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్లో జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.
‘ఆగస్ట్ 6 రాత్రి’ సినిమా(‘August 6 Ratri’ Movie) క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని మేకర్స్ తెలిపారు. కర్ణాటకలోని హొసకోట సమీపంలో భక్తరపల్లి పరిసరాల్లో మూడు రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. తాజాగా ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్లో జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు. బెంగళూరు, నెల్లూరు, అనంతపురం, హైదరాబాద్ లలో కేవలం 6 రోజుల్లో ఆగస్ట్ 6 రాత్రి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ..ఇప్పటికి 5 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్నామని, ఇక బ్యాలెన్స్ ఉన్న ఉదయభాను, సుమన్, నాగమహేశ్, మునిచంద్ర సీన్లు ఒకరోజులో చేయనున్నట్లు తెలిపారు. ఎం నాగేంద్రకుమార్ ఛాయాగ్రహణం, డి మల్లి సంకలనం, ఎంఎల్ రాజ సంగీతం అందించారు. ఈ చిత్రానికి పి.ఆర్ ఓ ధీరజ్- అప్పాజీ. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.