cm kcr: ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత కొల్లాపూర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ (cm kcr) ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఇక్కడికి ఎందుకు వచ్చారని.. సభ వేదికపై నుంచి ప్రసంగించారు. ఆయన మిమ్మల్ని ఆగం పట్టించేందుకు వచ్చారని చెప్పారు. ముళ్ల కిరీటం పెట్టేందుకు వచ్చాడా..? గడ్డి కోయడానికి వచ్చాడా అని సెటైర్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఇందిరమ్మ రాజ్యం ఉండేదని.. మరి 11 సార్లు అధికారం ఇస్తే ఎందుకు డెవలప్ చేయలేదని అడిగారు. పక్కనే కృష్ణా నది ఉన్న కొల్లాపూర్‌కు మంచినీరు ఇవ్వలేదని విమర్శించారు. ఆ రోజు రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూసిందని విమర్శించారు. ఇప్పుడు అదే నేతలు ఓట్ల కోసం వచ్చారని విరుచుకుపడ్డారు.