CM Bhagwant : కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను పరిశీలించిన సీఎం భగవంత్
తెలంగాణలోని ఇరిగేషన్ (Irrigation) ప్రాజెక్టులు అద్బుతంగా ఉన్నయని అటువంటి ప్రాజెక్టులను పంజాబ్ లో కూడా నిర్మించి అమలు చేస్తామని మాన్ తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్ద కలియ తిరిగి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందని పంజాబ్ సీఎం ప్రశంసించారు.
పంజాబ్ (Punjab) సీఎం భగవంత్ మాన్ సిద్దిపేట (Siddipet) జిల్లాలోని కొండపోచమ్మ(Kondapochamma) సాగర్ రిజర్వాయర్ ను సందర్మించారు. ప్రాజెక్టు పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని ఇరిగేషన్ (Irrigation) ప్రాజెక్టులు అద్బుతంగా ఉన్నయని అటువంటి ప్రాజెక్టులను పంజాబ్ లో కూడా నిర్మించి అమలు చేస్తామని మాన్ తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్ద కలియ తిరిగి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందని పంజాబ్ సీఎం ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్( Bhagwant Man) మాట్లాడుతూ.అద్భుతమైన నిర్మాణంతో పంట పొలాలకు నీటిని అందించేలా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణ (Telangana) ఇరిగేషన్ మోడల్స్ ను పంజాబ్ లో కూడా అమలు చేస్తామన్నారు.
తెలంగాణలో కాలువల ద్వారా నీటిని మళ్లించి పంటలు పండిస్తున్నారని..కానీ పంజాబ్ (Punjab) లో మాత్రం ఇలా ఉండవని..మా రాష్ట్రంలో బావులు, బోర్లతోనే పంటలు పండుతాయని తెలిపారు. కాలువల ద్వారా పంటలు పండించే విధానాన్ని కూడా పంజాబ్ లో అమలు చేస్తామన్నారు.దేశ వ్యాప్తంగా రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని..కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలపాలవుతున్నారని ఇటువంటి విధానం సమసిపోతే రైతుల కష్టాలు తీరుతాయని అన్నారు. తెలంగాణ (Telangana) ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు కొండపోచమ్మ సాగర్ సంప్ ను పనితీరును..అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తీరుతో పాటు మిషన్ భగీరథ (Mission Bhagiratha) గురించి కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రంజత్ కుమార్ (Ranjat Kumar) సీఎం భగవంత్ మాన్ కు వివరించారు.పంజాబ్‌లోని నీటిని కాపాడేందుకు నిమగ్నమై ఉన్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి సమాచారం తెలుసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ డ్యామ్‌ను పరిశీలించేందుకు వచ్చాం’ ఆయన ట్వీట్ చేశారు.
భూగర్భ జలాలను ఆదా చేసే సాంకేతికత గురించి సమాచారాన్ని తెలుసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాలను కాపాడేందుకు గ్రామాల్లో చిన్న డ్యామ్‌లు నిర్మించిందని, వాటి వల్ల ఇక్కడ భూగర్భ జలాలు 2 మీటర్ల వరకు పెరిగాయన్నారు. అనంతరం మర్కుక్ మండలం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యాంను పరిశీలిస్తారు. ఆ తర్వాత మల్లన్ సాగర్ (Mallan Sagar) , గజ్వేల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ (Mini tank bund) ,గా అభివృద్ధి చెందిన పాండవుల చెరువుని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.