ADB: మంచిర్యాల డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు పొందాలని అనుకునే వారు జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో సంప్రదించాలని కోరారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఓపెన్ స్కూల్లో చేరువారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.