మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సీతారామ్ పల్లి గోదావరి ఘాట్ సమీపంలో గురువారం శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది ఘాట్ పరిసరాలలో ఉన్న చెత్తను పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.