నిజామాబాద్: సీఎం కప్లో భాగంగా జిల్లాలో శనివారం నుంచి గ్రామస్థాయి క్రీడా పోటీలు ప్రారంభంకానున్నాయని డీవైఎస్వో ముత్తన్న ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్, ఫుట్ బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, యోగా విభాగాల్లో పోటీలుంటాయన్నారు. క్రీడాకారులు గ్రామాల్లోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.