ADB: బోరజ్ మండలం గూడ శివారు పొలాల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయం కూలీలకు పులి కనిపించిందన్న సమాచారంతో FSO అహ్మద్ ఖాన్, అనిమల్ ట్రాకర్లతో గాలింపు చేపట్టారు. పులి జాడ లభించలేదు. శుక్రవారం ఆ ప్రాంతానికి అర కి.మీ దూరంలో పులి అడుగులు గుర్తించినట్లు FSO ధృవీకరించారు.