WGL: జిల్లా వ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా నర్సంపేట పట్టణానికి చెందిన కూచన ప్రకాష్ మంగళవారం రాత్రి హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.