KMM: జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.