SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం శుక్రవారం పురస్కరించుకొని నిత్య దీపోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ఆవరణలో దీపోత్సవ కార్యక్రమం చేపట్టి దీపాలను వెలిగించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురోహితులు కార్తీక పురాణం విశిష్టతను వివరించారు.