MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఆలిండియా వాలీబాల్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను ఈ నెల 26న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై. శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. వయస్సు 17 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో , క్రీడా దుస్తులతో హాజరు కావాలన్నారు.