MNCL: మందమర్రి పట్టణంలోని పురుగుమందుల దుకాణాల్లో MAO కిరణ్మయి సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్ డైక్లోరైడ్ 24%’ గడ్డి మందును విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 60 రోజుల పాటు దీనిపై నిషేధం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.