SDPT: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ విమర్శించారు. యూరియాపై ఇచ్చే సబ్సిడీని తగ్గించే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. బడా కార్పొరేట్ వ్యాపారులకు సబ్సిడీలు ఇస్తూ, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సబ్సిడీ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.