BDK: కొల్లుగూడెం సమీపంలోని గోదారిలో ఈతకు ఏడుగురు యువకులు ఈతకు వెళ్ళగా అందులో ఐదుగురు గల్లంతు అయిన విషయం తెలిసిందే. తాజాగా గల్లంతయిన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలు భద్రాచలంకు చెందిన చారుగుండ్ల శ్రీకర్, ఉయ్యూరుకి చెందిన నవదీప్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.