SRD: కంగ్టి మండల భీంరా గ్రామంలో పోలియో చుక్కల వల్ల బాలుడు మృతి సంఘటనను జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల స్పందించి గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాట్లాడుతూ.. పోలియో వ్యాక్సిన్ వల్ల ఇలాంటి ప్రమాదాలు ఇది వరకు ఎక్కడ జరగలేదన్నారు. పల్స్ పోలియో వ్యాక్సిన్‌పై ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయొద్దని సూచించారు.