MHBD: కేసముద్రం మండలంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన చంద్రు తండా జీపీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి బానోతు శ్రీను మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. అతను గ్రామ తొలి సర్పంచ్‌గా ఎన్నిక కానున్నారు. అదేవిధంగా ఎనిమిది వార్డు స్థానాలకు ఒక్కొక్కరి చొప్పున అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో జీపీ ఏకగ్రీవం కానుంది.