BDK: ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని TWJF రాష్ట్ర కార్యదర్శి బసవయ్య తెలిపారు. మంగళవారం పాల్వంచలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికి నేటికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వమైన ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.