»Breaking Good News For Telangana Employees Sarkar Has Increased Da
Breaking: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎ పెంచిన సర్కార్
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జూన్ నెల జీతం నుంచే అందనున్నాయి.
తెలంగాణ(Telangana) ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు ప్రకటింది. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలకు అనుగుణంగా డీఏ(DA), డీఆర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కనీస వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెంచుతున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. దీనివల్ల పెన్షనర్లతోపాటు 7.28 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. పెంచిన డీఏ జూన్ నెల వేతనం నుంచే చెల్లించనున్నట్లు కేసీఆర్ సర్కార్ వెల్లడించింది.