TRS: కొత్త పార్టీ వెనుక బిజెపి ఉందా? వారి చేతుల్లోనే..
తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి వంటి పేర్ల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర్వాత.. ఈ పార్టీ పాత పేరు తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరికీ ఇచ్చే అవకాశం లేదు.
తెలంగాణలో (telangana) మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో (telangana rajya Samithi) ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ (trs) అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి వంటి పేర్ల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర్వాత.. ఈ పార్టీ పాత పేరు తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరికీ ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో టీఆరెఎస్ అని వచ్చేలా కొత్త పార్టీ పురుడు పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న పలువురు నాయకులు కలిసి ఈ పార్టీని పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటికే రిజిస్టర్ అయిన తెలంగాణ రాజ్య సమితిగా లేదంటే తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారట. పార్టీ జెండా కలర్ కూడా ఇప్పుడు బీఅర్ఎస్ పింక్ కు కొద్దిగా భిన్నంగా ఉండేలా చూసుకుంటారని చెబుతున్నారు.
టీఆరెఎస్ పేరుతో వచ్చే ఈ పార్టీ వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ పార్టీని ముందుకు నడిపించేది వీరే కావొచ్చు అనే ప్రచారం సాగుతోంది. అలాంటి పేర్లలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితర పేర్లు వినిపిస్తున్నాయి. పొంగులేటి జూపల్లి వంటి వారు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరు బిజెపిలోకి వెళ్తారని ప్రచారం సాగింది. పొంగులేటి అడుగులు అటుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ పొంగులేటి వంటి నేతల ఆధ్వర్యంలో వస్తే.. ఆ వెనుక బిజెపి ఉందనే అర్థం అంటున్నారు. కోమటిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ పేర్లు ఊహాగానాలు మాత్రమే. టీఆరెఎస్ కొత్త పార్టీని ఎవరు లీడ్ చేస్తారో మున్ముందు తెలియనుంది.