MNCL: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని మంచిర్యాల DCP భాస్కర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల వేళ లైసెన్స్ డ్ గన్లను డిపాజిట్ చేసుకున్నామన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు.