NLG: వందేమాతరం గీతాలాపనకు 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూర్తి గీతాన్ని పాడటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ. అపర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.