డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బుధవారం MLA కోవ లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ నామకరణం చేసినప్పటికీ కళాశాల వద్ద బోర్డు ఏర్పాటు చేయలేదని, కళాశాల వెబ్సైట్లోను బాపూజీ పేరు నమోదు చేయాలని ఆమె కోరారు. దీంతోపాటు చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.