SRD: కోహీర్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనేంటి మాణిక్యరావు హాజరయ్యారు. కోహిర్ పట్టణంలోని ఓ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు ఫలాలు అందజేసి దీక్షను విరమింపజేశారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.