బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్… అరవింద్ కి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత… టీఆర్ఎస్ కార్యకర్తతల తీరుపై మండిపడ్డారు. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు.
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ సహనాన్ని చేతకాని తనం అనుకోవద్దని… తమ కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఎంపీ అరవింద్ తన ఇంటిపై జరిగిన దాడిపై స్పందించారు. ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ టీఆర్ఎస్ పై ఫైరయ్యారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతో హైదరాబాద్ లోని నా ఇంటిపై దాడి చేశారు టీఆర్ఎస్ గూండాలు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు’’ అని ట్వీట్ చేశారు.