NGKL: తిమ్మాజి పేటలోని పలు హోటళ్లను మంగళవారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ తన సిబ్బందితో కలిసి తనిఖీచేశారు. హోటళ్లలో చికెన్ వంటల్లో వాడే నూనెను ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపించారు. కల్తీ అని తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పర్మిషన్ లేని హోటళ్ల యజమానులకు నోటీసులు జారీచేశారు.