దేశంలో ఈ మధ్యకాలంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ రాగా.. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పాడు. ఓ ప్రయాణికుడి వద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయని భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.