AP: ఓటింగ్ షేర్ తక్కువని కాంగ్రెస్కు అస్తిత్వమే లేదన్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘38% ఓట్ షేర్ పెట్టుకుని YCP అసెంబ్లీకి వెళ్లట్లేదు. అలాంటప్పుడు మీకు, మాకు తేడా లేదు. ప్రజలు ఓట్లు వేసింది శాసనసభలో మైకుల ముందు మాట్లాడాలని.. ఇంట్లో కూర్చోటానికి కాదు. ప్రతిపక్షం కాకపోయినా 11మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయండి’ అని డిమాండ్ చేశారు.