AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర శాసనమండలిలో గందరగోళం నెలకొంది. సోషల్ మీడియా అరెస్ట్‌లపై వైసీపీ, డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టగా.. వాటిని సభ ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.