»Godhra Train Burning Case Supreme Court Grants Bail To Eight Convicts
Godhra Riots Case : గోద్రా అల్లర్ల కేసులో ఎనిమిది మంది దోషులకు బెయిల్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన 2002 గోద్రా అల్లర్ల కేసు(Godhra Riots Case)లో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు(supreme Court) బెయిల్ మంజూరు చేసింది. నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురు దోషులకు బెయిల్‌ను తిరస్కరించింది.
Supreme Court asked to andhra pradesh government for corona death compensation
Godhra Riots Case : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన 2002 గోద్రా అల్లర్ల కేసు(Godhra Riots Case)లో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు(supreme Court) బెయిల్ మంజూరు చేసింది. నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురు దోషులకు బెయిల్‌ను తిరస్కరించింది. ఈ ఎనిమిది మంది ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష(Life imprisonment) అనుభవిస్తున్నారు. దోషులు 17 ఏళ్ల జైలు జీవితం పూర్తి చేసుకున్నారని.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది. నేరంలో కీలక పాత్ర పోషించారని మరో నలుగురు దోషుల బెయిల్ పిటిషన్(Bail Petition)లను తిరస్కరించింది. ఈ నలుగురికి తొలుత ట్రయల్ కోర్టు(Trial Court) ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది.
గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Solicitor General Tushar Mehta) వాదనలు వినిపిస్తూ కోచ్ కు బయటి నుంచి నిప్పు పెట్టారని తెలిపారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 58 మంది మృతి చెందారు. తన పాత్ర కేవలం రాళ్లు రువ్వడం వరకే పరిమితమైందని కొందరు అంటున్నారని తుషార్ మెహతా అన్నారు. కానీ ఒక పెట్టెను బయటి నుంచి తాళం వేసి, దానికి నిప్పుపెట్టి, ఆపై రాళ్లు విసిరినప్పుడు అది కేవలం రాళ్లు రువ్వడం మాత్రమే కాదని వాదించారు.
దోషులపై TADA చట్టం ప్రయోగించినట్లు తెలిపిన గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt).. వారిని ముందస్తుగా విడుదల చేయకూడదని విజ్ఞప్తి చేసింది. అటు దోషుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. వారు 17 ఏళ్లు జైలులో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంను కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు 8 మందికి బెయిలు మంజూరు చేసి మరో నలుగురి అభ్యర్థనలను తిరస్కరించింది.