AP: అసెంబ్లీలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో గత ప్రభుత్వం భారీ స్కామ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై అవినీతి చేశారు. విశాఖలో అవినీతిని నేను నిరూపిస్తా. లేకపోతే ఏ శిక్షకైనా నేను సిద్ధమే. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.