అమెరికా ఎన్నికల తర్వాత ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’కు యూజర్ల సంఖ్య తగ్గింది. ఎన్నికల అనంతరం దాదాపు 1,15,000 మంది అమెరికా యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వీడినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.