NRML: నర్సాపూర్ జి. మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని గురువారం స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులను, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.