భారత్- చైనా దేశాల రక్షణ శాఖ మంత్రులు త్వరలో భేటీ కానున్నారు. వచ్చే వారంలో చైనా రక్షణమంత్రి డాంగ్ జున్‌తో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గిన తర్వాత తొలిసారిగా ఇరు దేశాలు సమావేశం కానున్నాయి. సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.