MHBD: పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో చలివేంద్రం ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు కోరారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్కు చలివేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఉపాధి కోసం పట్టణం నుంచి గ్రామాలకు, కూలీలకు వెళ్లే ప్రయాణికులు అంబేద్కర్ సర్కిల్లో వెయిట్ చేస్తుంటారని వారి సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.