MDCL: ఘట్కేసర్ పరిధి ఔషాపూర్, ఎదులాబాద్ డివిజన్ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ సహా నివాస, పరిశ్రమ ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల ఈ పరిసరాల్లో 4 కంటే ఎక్కువ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే.. సమీపంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అత్యవసర సేవలు ఆలస్యంగా చేరుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.