WNP: గోపాల్ పేటలో కోదండ రామస్వామి జాతరను పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతి రూ. లక్ష, రెండో బహుమతి రూ. 80వేలు, మూడో బహుమతి రూ.60 వేలు, నాలుగో బహుమతి రూ. 40 వేలు, 5వ బహుమతి రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.