SRD: నారాయణఖేడ్ పట్టణంలోని పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో మూడో రోజు సోమవారం యంత్ర స్థాపన, విగ్రహాల ప్రాణ ప్రతిష్ట, కలశ స్థాపన, మూర్తి స్థాపన కార్యక్రమాలు సంగ్రామ్ మహారాజ్, వేద పండితుల చేతుల మీదుగా వైభవంగా జరిగాయి. అనంతరం వైదిక నిర్వహణ పురోహిత సార్వభౌమ మలమంచి గురురాజ శర్మ పూర్ణాహుతి నిర్వహించి కార్యక్రమాలను ముగించారు. స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.