NRML: పిడుగుపాటుకు ఆవు మృతి చెందిన ఘటన సారంగాపూర్ మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బంద్రేవ్ తండా ఆడే కిషన్ కు చెందిన ఆవు మేతకు వెళ్ళగా భారీ వర్షం కురిసి పిడుగు పడింది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. ఆవు విలువ సుమారు 30 వేలు ఉంటుందని, ప్రభుత్వం బాధితుడిని ఆదుకోవాలని కోరారు.